స్వామియే శరణం అయ్యప్ప.. తెరుచుకున్న శబరిమల ఆలయం.. ఇవి తెలుసుకోండి..

స్వామియే శరణం అయ్యప్ప.. తెరుచుకున్న శబరిమల ఆలయం.. ఇవి తెలుసుకోండి..

పథనంతిట్ట(కేరళ): కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల ఆలయం ఆదివారం సాయంత్రం 5 గంటలకు తెరుచుకుంది. మకర విళక్కు సీజన్లో మండల పూజ కోసం నవంబర్ 16న సాయంత్రం 5 గంటలకు ఆలయం తెరుచుకోగా.. లక్షలాది భక్తులు స్వామిని దర్శనం కోసం తరలి వస్తున్నారు. కేరళలోని శబరి కొండ స్వామియే శరణం అయ్యప్ప నామంతో మారు మ్రోగుతుంది. నవంబర్ 16న ప్రారంభమైన మండల పూజ సీజన్, డిసెంబర్ 26న సన్నిధానంలో జరిగే ప్రత్యేక పూజతో ముగియనుంది.

ఈ ఏడాది భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు, ఆరోగ్య, రవాణా శాఖలతో పాటు స్థానిక అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. పథనంతిట్ట జనరల్‌‌ హాస్పిటల్‌‌లో 24 గంటలూ శబరిమల వార్డు అందుబాటులో ఉంటుందని, దీంతో పాటు అన్ని సౌకర్యాలతో బెడ్లను ఏర్పాటు చేశామని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇక్కడ అన్ని మందులు, టెస్టులు ఫ్రీగా చేస్తామని వెల్లడించింది.

చెస్ట్ పెయిన్‌‌, గుండె పోటు వచ్చిన భక్తులకు 5 నిమిషాల్లో హెల్త్‌‌ వర్కర్లు ట్రీట్‌‌మెంట్‌‌ చేసి, హాస్పిటల్‌‌కు తరలిస్తారని పేర్కొంది. వయసు పైబడిన భక్తులకు కొండపైకి ఎక్కడానికి సాయం చేసేందుకు హెల్త్‌‌ వర్కర్లు అందుబాటులో ఉంటారని చెప్పింది. యాత్రా మార్గంలో రోడ్డు ప్రమాదాలను నివారణ, అత్యవసర పరిస్థితుల్లో సాయానికి ‘‘సేఫ్ జోన్‌‌” ప్రాజెక్ట్‌‌తో మోటార్‌‌‌‌ వెహికల్స్ డిపార్ట్ మెంట్‌‌ ప్రత్యేక చర్యలు తీసుకుంది.