
ముంబైలో జరిగిన ఇండియా కూటమి సభలో రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీబీఐ, ఈడీలను మోదీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తూ బెదిరిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.తనను కూడా బీజేపీ ప్రభుత్వం వేధించిందన్నారు. నోట్ల రద్దు. జీఎస్టీ ప్రభావంతో చాలామంది ఉద్యోగాలు కోల్పోయారని రాహుల్ అన్నారు. కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరకపోతే జైలుకు పంపిస్తామని బెదిరిస్తున్నారని రాహుల్ అన్నారు. ఈ విషయాన్ని పార్టీని వీడే నేతలు సోనియాగాంధీతో చెప్పారని రాహుల్ అన్నారు.