మరో వివాదంలో కంగనా.. ముంబైలో కేసు నమోదు

మరో వివాదంలో కంగనా.. ముంబైలో కేసు నమోదు

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మరో వివాదంలో ఇరుక్కున్నారు  ముంబైలోని ఖార్ పోలీస్ స్టేషన్‌లో ఆమెపై   ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. ఇటీవల మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ కేంద్రం ప్రకటించిన  సందర్భంగా రైతుల ఉద్యమాన్ని ఖలిస్తాన్ తో పోల్చుతూ తన ఇన్ స్ట్రాగ్రమ్ లో ఓ పోస్ట్ చేశారు కంగనా రనౌత్. దీంతో తమ మనోభావాలు తెబ్బతినేలా వ్యాఖ్యలు చేసిందంటూ.. కంగనా రనౌత్‌పై సిక్కు సంఘం నేతలు పోలీసులకు  ఫిర్యాదు చేశారు. ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్‌మెంట్ కమిటీ అధ్యక్షుడు మంజీందర్ సింగ్ సిర్సా నేతృత్వంలోని ప్రతినిధి బృందం సోమవారం ముంబైలో సీనియర్ పోలీసు అధికారులను కలిసింది. కంగన పదే పదే సిక్కుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తోందని.. ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని  కోరింది.

https://twitter.com/ANI/status/1463128698643615745