కవిత వ్యాఖ్యలపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు: వికాస్ రాజ్

కవిత వ్యాఖ్యలపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు: వికాస్ రాజ్

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ  కవితకు బిగ్ షాక్ తగిలింది.  ఓటు వేసిన అనంతరం పోలింగ్ బూత్ బయట ప్రచారం చేయడంతో  కవితపై ఫిర్యాదు అందినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు.  దీనిపై  డీఈవోకు ఆదేశాలిచ్చామని ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదు అయిందని చెప్పారు.  

తెలంగాణ ఎన్నికల సరళిపై మీడియాతో మాట్లాడిన   వికాస్ రాజ్ ..  రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోందిని తెలిపారు.  ఈవీఎం సమస్యలు వచ్చిన దగ్గర కొత్తవి మార్చామని వెల్లడించారు.  రూరల్ లో పోలింగ్ శాతం బాగానే ఉందన్న ఆయన..  అర్బన్ ఏరియాల్లో ఇంకా పోలింగ్ శాతం పెరగాలన్నాురు.  

అక్కడక్కడ చిన్న చిన్న ఘర్షణలు జరిగాయని,జరిగిన ప్రతి కంప్లైంట్స్ పై డీఈవోలను రిపోర్ట్ అడిగామన్నారు వికాస్ రాజ్.  ఉదయం 11గంటల వరకు 20.64శాతం నమోదు అయిందని తెలిపారు.