
ఎల్బీనగర్ షైన్ చిల్డ్రన్స్ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఉదయం ఆస్పత్రిలో జరిగిన అగ్నిప్రమాదంలో మృతి చెందిన చిన్నారి మృత దేహానికి పోస్టుమార్టం చేసేందుకు డాక్టర్లు నిరాకరిస్తున్నారు. ఎఫ్ఐఆర్ కాఫీ తీసుకొస్తేనే పోస్టుమార్టం చేస్తామని అనడంతో చిన్నారి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ప్రమాదం జరిగిన తర్వాత ఇప్పటి వరకూ ఆస్పత్రి యాజమాన్యం రాలేదు. అధికారులు ఎవరూ కూడా పట్టించుకోవడం లేదు. దీంతో చిన్నారి కుటంబానికి మద్దతుగా విద్యార్థి సంఘాలు, ప్రజాసంఘాలు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగాయి. అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని అరెస్ట్ చేసి ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.