సూర్యాపేట జిల్లాలో అగ్నిప్రమాదం జరిగింది. మేళ్లచెరువు రోడ్డులోని చార బయో మాస్ స్టాక్ పాయింట్ దగ్గర మంటల చెలరేగాయి. శనివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి... మేళ్లచెరువు రోడ్డులో పెద్ద కాలువ సమీపంలోని చార బయోమాస్ స్టాక్ పాయింట్ దగ్గర నిల్వ ఉంచిన పత్తి కట్టల కుప్పకు నిప్పు అంటుకుంది.
ఈ ప్రమాదంలో ఐదెకరాల్లో పత్తి కట్టే తగలబడింది. స్థానికులసమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది ఫైర్ ఇంజిన్ సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు, నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.
