మనోహరాబాద్ మండలంలో హార్న్ బ్యాక్ కంపెనీలో ఫైర్ యాక్సిడెంట్..రూ.20 లక్షల వరకు నష్టం

మనోహరాబాద్ మండలంలో హార్న్ బ్యాక్  కంపెనీలో ఫైర్ యాక్సిడెంట్..రూ.20 లక్షల వరకు నష్టం

మనోహరాబాద్, వెలుగు: ​మండలంలోని కుచారం పారిశ్రామిక వాడలో హార్న్ బ్యాక్ ఈ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ సైకిల్ కంపెనీలో శనివారం ఉదయం షార్ట్ సర్క్యూట్ జరిగింది. ఈ ప్రమాదంలో క్యాబిన్ తో పాటు సైకిల్ తయారీకి సంబంధించిన విలువైన బ్యాటరీ వస్తువులు కాలిపోయాయి. కంపెనీ సిబ్బంది ఫైర్ స్టేషన్ కి సమాచారం ఇవ్వడంతో 3 ఫైర్ ఇంజన్లు వచ్చి మంటలను అదుపు చేశాయి. నష్టం దాదాపు రూ.20 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు. 

యాక్సిడెంట్ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. మనోహరాబాద్ మండలం పారిశ్రామిక ప్రాంతం కావడం, ఇక్కడ ఫైర్ స్టేషన్ లేకపోవడంతో నర్సాపూర్ నుంచి ఫైర్ ఇంజన్ ఈ ప్రాంతానికి చేరుకునేసరికి నష్ట తీవ్రత ఎక్కువవుతోందని స్థానికులు చెబుతున్నారు. కలెక్టర్ స్పందించి ప్రత్యేకంగా ఫైర్ స్టేషన్ మంజూరు చేయాలని పారిశ్రామిక వాడ యజమానులు కోరుతున్నారు. ఫైర్ యాక్సిడెంట్ జరిగిన ప్రాంతాన్ని ఫైర్ ఆఫీసర్ వేణు, ఎస్ఐ సుభాష్ గౌడ్ పరిశీలించారు.