కాటేదాన్ ప్లాస్టిక్ ఇండస్ట్రీలో ఫైర్ యాక్సిడెంట్

కాటేదాన్ ప్లాస్టిక్ ఇండస్ట్రీలో ఫైర్ యాక్సిడెంట్

శంషాబాద్, వెలుగు: రాజేంద్రనగర్ సర్కిల్ కాటేదాన్ పారిశ్రామిక వాడ టాటా నగర్ లోని ఓ ప్లాస్టిక్ కంపెనీలో అగ్నిప్రమాదం జరిగింది. టాటా నగర్ ప్రాంతంలో ఓ ప్లాస్టిక్​ పరిశ్రమ మూడు నెలలుగా మూసి ఉంటోంది. అందులో ఆదివారం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. 

భారీగా మంటలు వ్యాపించి దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. రెండు ఫైర్ ఇంజన్లతో ఫైర్​ సిబ్బంది అక్కడికి చేరుకుని మండలను అదుపు చేశారు. షాట్​ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.