
చిత్తూరు జిల్లా యాదమరి మండలం మోర్ధానపల్లెలోని అమర రాజా ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. టీబీడీ ప్లాంట్ లో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. ఘటనా స్థలానికి చేరుకున్న 4 ఫైర్ ఇంజన్లు మంటలను అదుపులోకి తెస్తున్నాయి. పోలీసులు, రెవెన్యూ అధికారులు ప్రమాదానికి గల కారణాలను ఆరాదీశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం సంభవించి ఉండవచ్చునని భావిస్తున్నారు. ఫ్యాక్టరీలో పని చేసే కార్మికులను సురక్షితంగా బయటకు పంపినట్లు యాజమాన్యం ప్రకటించింది. భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది.