ప్రభుత్వ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. బయటకు పరుగుపెట్టిన పేషెంట్లు

ప్రభుత్వ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. బయటకు పరుగుపెట్టిన పేషెంట్లు

రంగారెడ్డి జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. డయాలసిస్  సెంటర్ లో కొంత భాగం దగ్ధమైంది. పేషెంట్లు భయబ్రాంతులకు గురై బయటకు పరుగులు తీశారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. 

ఈ ఘటనలో డయాలసిస్ సెంటర్ లోని కొన్ని పరికరాలు కాలిపోయాయి. షార్ట్ సర్క్యూట్ వెళ్లే అగ్నిప్రమాదం జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.