ఢిల్లీ ఎయిమ్స్ లో అగ్ని ప్రమాదం..ఎమర్జెన్సీ వార్డు నుంచి పేషెంట్లు పరుగులు

ఢిల్లీ ఎయిమ్స్ లో అగ్ని ప్రమాదం..ఎమర్జెన్సీ వార్డు నుంచి పేషెంట్లు పరుగులు

దేశ రాజధాని ఢిల్లీలోని ప్రముఖ ఎయిమ్స్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆగస్ట్ 7వ తేదీ మధ్యాహ్నం 12 గంటల సమయంలో.. ఎయిమ్స్ నాలుగో అంతస్తుల నుంచి మంటలు చెలరేగాయి. ఈ అంతస్తులోని ఎండోస్కోపిక్ ఎమర్జెన్సీ వార్డులో మొదటగా మంటలు వచ్చాయి. ఆ వెంటనే దట్టమైన పొగలు కమ్మేశాయి. నాలుగో అంతస్తు నుంచి దట్టమైన పొగలు రావటంతో.. మంటలు వ్యాపించటంతో.. ఎమర్జెన్సీ వార్డులోని పేషెంట్లు అందర్నీ బయటకు తీసుకొచ్చారు వైద్య సిబ్బంది.

ఇదే సమయంలో బిల్డింగ్ లో మంటలు రావటాన్ని చూసిన మిగతా రోగులు, వారి బంధువులు, ఆస్పత్రికి వచ్చిన ఇతర రోగులు భయంతో పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నాయి.  ఆరు ఫైరింజన్లతోపాటు.. పెద్ద ఎత్తున ఫైర్, పోలీస్ సిబ్బంది ఎయిమ్స్ ఆస్పత్రికి చేరుకున్నాయి. ఆందోళనలో ఉన్న రోగులను సముదాయిస్తున్నారు. ప్రస్తుతానికి ఎలాంటి ప్రాణ నష్టం లేదని ప్రకటించింది ఎయిమ్స్. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు వచ్చాయని చెబుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.