
శంషాబాద్, వెలుగు: శంషాబాద్ మున్సిపాలిటీ పరిధి ఉట్ పల్లి సదరన్ వెంచర్ లోని కార్తికేయ ఎలక్ట్రిక్ బైక్షోరూంలో శనివారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం జరిగింది. ఏసీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి 16 వెహికల్స్ పూర్తిగా దగ్ధం అయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. దాదాపు రూ.15లక్షల వరకు నష్టం వాటిల్లిందని షాపు యజమాని శ్రీనివాస్ తెలిపారు. కేసు నమోదు చేసుకున్న శంషాబాద్ రూరల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.