జూబ్లీహిల్స్ 45లోని హార్ట్ కప్ కేఫ్ లో మంటలు : మొత్తం కాలిబూడిద అయ్యింది..!

జూబ్లీహిల్స్ 45లోని హార్ట్ కప్ కేఫ్ లో మంటలు : మొత్తం కాలిబూడిద అయ్యింది..!

జూబ్లీహిల్స్ లో చిల్ అయ్యే ప్లేసుల్లో ఒకటి హార్ట్ కప్ కేఫ్. ఈవినింగ్ అయిన ఇక్కడ ఫుల్ క్రౌడ్. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో పెద్దమ్మ గుడి సమీపంలో ఉండే ఈ హార్ట్ కప్ కేఫ్ పేరుతో జంక్షన్ కూడా ఉంది. ఇప్పుడు ఈ హార్ట్ కప్ కేఫ్ మంటల్లో కాలి బూడిద అయ్యింది. 2025, అక్టోబర్ 24వ తేదీ ఉదయం ఫైర్ యాక్సిడెంట్ వల్ల మంటల్లో మొత్తం కాలిపోయింది. 

ప్రస్తుతం ఈ హార్ట్ కప్ కేఫ్ మూసివేసి ఉంది. కొన్నాళ్లుగా ఓపెన్ చేయటం లేదు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది.  ప్రమాదం సమయంలో కేఫ్ లో ఎవరూ లేరని చెబుతున్నారు ఫైర్ సిబ్బంది. ప్రమాదానికి కారణం ఏంటీ.. ఎలా జరిగింది.. మంటలు ఎలా వచ్చాయి అనే విషయాలపై విచారణ చేస్తున్నారు. 

ALSO READ : ఇద్దరు సాఫ్ట్ వేర్ అమ్మాయిలు మృతి

ఈ అగ్ని ప్రమాదంతో హార్ట్ కప్ కేఫ్ లోని ఫర్నిచర్, డెకరేషన్ సామాగ్రి మొత్తం కాలిపోయాయి. కుర్చీలు, టేబుల్స్ ఇతర సామాగ్రి మొత్తం మంటల్లో నాశనం అయినట్లు ఫైర్ సిబ్బంది చెబుతున్నారు. సమాచారం వచ్చిన వెంటనే స్పాట్ కు చేరుకున్నామని.. అప్పటికే చాలా సామాగ్రి కాలిపోయినట్లు చెబుతున్నారు ఫైర్ సిబ్బంది. మంటలు చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించకుండా వెంటనే చర్యలు తీసుకున్నారు.