ఇద్దరు సాఫ్ట్ వేర్ అమ్మాయిలు మృతి : బెంగళూరు నుంచి దీపావళికి హైదరాబాద్ వచ్చి..

ఇద్దరు సాఫ్ట్ వేర్ అమ్మాయిలు మృతి : బెంగళూరు నుంచి దీపావళికి హైదరాబాద్ వచ్చి..

శుక్రవారం ( అక్టోబర్ 24 ) తెల్లవారు జామున జరిగిన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదంతో తెలుగు రాష్ట్రాలు ఉలిక్కి పడ్డాయి. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సు బైకును ఢీకొని పూర్తిగా దగ్ధమైన  ఘటనలో 20 మందికి పైగా మృతి చెందారు. ఈ ప్రమాదంలో ఇద్దరు సాఫ్ట్ వేర్ అమ్మాయిలు ఈ ప్రమాదంలో మృతి చెందారు. దీపావళి పండగకి ఉరికి వచ్చి తిరిగి వెళ్తూ ఒకరు, హైదరాబాద్ లోని మేనమామ ఇంటికి వచ్చి తిరిగి వెళ్తూ మరొకరు మృతి చెందారు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..  

యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన అనూష రెడ్డి దీపావళికి ఉరికి వచ్చి బెంగుళూరుకి తిరిగి వెళ్తూ బస్సులో సజీవ దహనమయ్యింది. బాపట్ల జిల్లాకు  చెందిన మరొక సాఫ్ట్ వేర్ ఉద్యోగి ధాత్రి హైదరాబాద్ లోని మేనమామ ఇంటికి వచ్చి తిరిగి వెళ్తూ మృతి చెందింది. అనూష స్వస్థలం యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం వస్తకొండూరుగా గుర్తించారు. అనూష మరణంతో వస్తకొండూరులో విషాద ఛాయలు అలుముకున్నాయి. 

►ALSO READ | 20 మందిని బలి తీసుకున్న బస్సు.. యాక్సిడెంట్ ముందు.. తర్వాత.. ఓవర్ స్పీడ్ పై రూ.23 వేల చలాన్లు

అనూష మరణంతో ఆమె కుటుంబం తీవ్ర విషాదం నింపింది. పండగకి ఇంటికి సంతోషంగా గడిపిన కూతురు తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో అనూష తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. మరో మృతురాలు ధాత్రి స్వస్థలం బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలం పూసపాడుగా గుర్తించారు. బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్న ధాత్రి హైదరాబాద్ లోని మేనమామ ఇంటికి వచ్చి తిరిగి బెంగళూరు వెళ్తూ మృతి చెందింది.

ఇదిలా ఉండగా.. ప్రమాదంలో దగ్ధమైన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు గురించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.. బస్సు నెంబర్  DD01N9490.. DD అంటే డామన్ డయ్యూ కింద ఉంది. బస్సు ఫిట్‌నెస్, పర్మిట్ ఉంది. ఈ లైసెన్స్, పర్మిట్ కు సంబంధించిన అంశాలు ఒడిశా రాష్ట్ర పరిధిలోకి వస్తాయి. బస్సు పర్మీట్ అంతా ఒడిశాలో ఉంది.. తిరుగుతున్నది మాత్రం మూడు రాష్ట్రాల్లో.. తెలంగాణ నుంచి కర్నాటక రాష్ట్రం వెళుతుంది.. మార్గమధ్యంలో ఏపీలో యాక్సిడెంట్ అయ్యింది. మొత్తానికి వేమూరి కావేరి ట్రావెల్ బస్సు యాక్సిడెంట్ వల్ల.. ట్రావెల్ బస్సులు ఏ విధంగా నడుస్తున్నాయి అనేది స్పష్టం అవుతుంది. 

మరో విషయం ఏంటంటే..  DD01N9490 నెంబర్ బస్సు యాక్సిడెంట్ ముందు.. యాక్సిడెంట్ తర్వాత ఎలా ఉంది పైన ఫొటో స్పష్టం చేస్తుంది. ఈ బస్సుపై తెలంగాణలో 23 వేల రూపాయల ట్రాఫిక్ చలాన్లు ఉన్నాయి. ఈ చలాన్లు అన్నీ ఓవర్ స్పీడ్ కారణంగా పడినవే.  అంటే ఈ బస్సు ఓవర్ స్పీడ్ అనేది చాలా కామన్ గా కనిపిస్తుంది.. ట్రాఫిక్ పోలీసుల చలాన్లు చూస్తుంటే.. ఈ ఓవర్ స్పీడ్ వల్లే ఇంత పెద్ద యాక్సిడెంట్ అయ్యిందా అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి.