
హైదరాబాద్ - కోఠిలో సోమవారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. హనుమాన్ టేక్డిలోని నకోడా కాంప్లెక్స్ లో జరిగిన ఈ ప్రమాదంతో కాంప్లెక్స్ లోని అన్ని షాపులకు మంటలు వేగంగా వ్యాపించడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అగ్ని ప్రమాదం జరిగిన నకోడా కాంప్లెక్స్ లో బట్టలు, ఆప్టికల్స్, ప్లాస్టిక్ సామాను షాపులు ఉన్నాయి. ఈ ప్రమాదం కారణంగా ప్రాణ నష్టం జరగనప్పటికీ భారీగా ఆస్తి నష్టం జరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. షార్ట్ సర్య్కూట్ అయి ఉండొచ్చు అని అనుమానిస్తున్నారు.