
పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ వైఎంసీఏ చౌరస్తాలో పుష్పక్ ఎలక్ట్రిక్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. ఆదివారం రాత్రి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి జూబ్లీ బస్‌స్టేషన్‌కు బస్సు బయలుదేరింది. వైఎంసీఏ చౌరస్తా వద్దకు రాగానే బస్సు వెనుక భాగంలో షార్ట్ సర్క్యూట్‌కారణంగా పొగలు, మంటలు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సును పక్కకు నిలిపివేశాడు. అనంతరం ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.