ఉజ్జయినీ మహాకాళేశ్వర్‌‌‌‌‌‌‌‌..టెంపుల్‌‌‌‌లో అగ్ని ప్రమాదం

ఉజ్జయినీ మహాకాళేశ్వర్‌‌‌‌‌‌‌‌..టెంపుల్‌‌‌‌లో అగ్ని ప్రమాదం
  •      14 మందికి గాయాలు

భోపాల్‌ ‌‌‌:  మధ్యప్రదేశ్‌‌‌‌లోని ఉజ్జయినీ మహాకాళేశ్వర్‌‌‌‌‌‌‌‌ ఆలయంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సోమవారం హోలీ పండుగ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన ‘భస్మా హారతి’కార్యక్రమంలో అగ్ని ప్రమాదం జరిగిందని ఉజ్జయిని జిల్లా కలెక్టర్‌‌‌‌‌‌‌‌ తెలిపారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటున్న క్రమంలో పూజారి చేతిలో ఉన్న హారతి పల్లెం కింద పడటంతో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయని చెప్పారు. 

ఈ ఘటనలో పూజారులు, సేవకులు సహా 14 మందికి గాయాలయ్యాయని వెల్లడించారు. వెంటనే వారిని స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించామని, సీరియస్‌‌‌‌ ఉన్న వారిని ఇండోర్‌‌‌‌‌‌‌‌కు తీసుకెళ్లి ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ అందిస్తున్నామన్నారు. వెంటనే ఆలయ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. హాలీ రంగుల్లో కెమికల్‌‌‌‌ పదార్థాలు ఉండటం వల్లే హారతి పల్లెం కింద పడగానే మంటలు అంటుకున్నాయని అధికారులు తెలిపారు. ఈఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు.