అంబర్పేట్లో అగ్ని ప్రమాదం.. డాంబర్లో టార్పెంటాయిల్ కలుపుతుండగా..

అంబర్పేట్లో అగ్ని ప్రమాదం.. డాంబర్లో టార్పెంటాయిల్ కలుపుతుండగా..

అంబర్పేట్ అలీ కేఫ్ వద్ద పెయింటింగ్  కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు ఎగసిపడుతున్నాయి. మంటల్లో మహిళ చిక్కుకుపోయింది. తీవ్ర గాయాలు కావడంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది స్పాట్కు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అగ్ని ప్రమాదం జరిగిన పెయింటింగ్ తయారీ కంపెనీ ఇళ్ల మధ్యలో ఉండటం గమనార్హం. ఈ ఘటనతో స్థానిక బస్తీవాసులు బెంబేలెత్తారు. అంబర్ పేట్ వడ్డెర బస్తీలో ఉన్న సాయి కృష్ణ పెయింట్స్ కంపెనీలో ఉదయం 11.25 కి అగ్ని ప్రమాదం జరిగింది.

డాంబర్లో టార్పెంటాయిల్ కలుపుతుండగా రియాక్షన్ అయి ఫైర్ యాక్సిడెంట్ జరిగినట్లు తెలిసింది. రెండు ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. లత అనే మహిళకు 25 శాతం కాలిన గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అగ్నిప్రమాదానికి గురైన సాయికృష్ణ పెయింట్స్  కంపెనీలోనే ఆ మహిళ పని చేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. ఫైర్ యక్సిడెంట్ జరిగిన టైంలో మహిళతో పాటు మరో ఇద్దరు వర్కర్స్ ఆ కంపెనీలో ఉన్నారు. మంటలు రాగానే ఆ ఇద్దరు వ్యక్తులు తప్పించుకుని బయటపడ్డారు. మంటల్లో చిక్కుకుపోవడంతో ఆ మహిళ తనంతట తానుగా బయటపడలేకపోయింది. రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న ఇలాంటి ఫ్యాక్టరీలు తొలగించాలని స్థానికులు డిమాండ్ చేశారు.