శంకరపట్నం, వెలుగు: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్ గ్రామ సర్పంచ్ ప్రమాణస్వీకారానికి ముందే ఇచ్చిన హామీ నెరవేర్చారు. రెండో దశలో జరిగిన ఎన్నికల్లో సర్పంచ్‌గా దుర్గపు సుజాతతిరుపతి విజయం సాధించారు.
ఎన్నికలకు ముందు గ్రామంలోని కోతులను పట్టిస్తానని హామీ ఇచ్చారు. ఈక్రమంలో బుధవారం గ్రామంలోని సుమారు 2వేల కోతులను పట్టించినట్లు సర్పంచ్ తెలిపారు. పట్టినందుకు కోతికి రూ.100 చొప్పున చెల్లించినట్లు చెప్పారు.
