ఔటర్‌పై కారులో మంటలు.. ఒకరికి తీవ్ర గాయాలు

V6 Velugu Posted on Jul 22, 2021

రంగారెడ్డి జిల్లా: శంషాబాద్ ఓఆర్ఆర్ పై ఓ కారులో మంటలు చెలరేగాయి. దీన్ని గమనించి ఆటో,  లారీ డ్రైవర్లు... కారులోని శ్రీనివాస్ ను బయటకు తీశారు. అయితే మంటలు అంటుకొని తీవ్రంగా గాయపడడంతో అతన్ని 108 వాహనంలో శంషాబాద్ లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. శంషాబాద్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని కారులో వచ్చిన మంటలు ఆర్పారు. గాయపడ్డ వ్యక్తి రంగారెడ్డి జిల్లా కొత్తూర్‌ మండలం తిమ్మాపూర్‌ కు చెందిన శ్రీకాంత్‌ గా గుర్తించారు. శ్రీకాంత్ మంటల్లో చిక్కుకుని తీవ్రంగా గాయపడడంతో అతని పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డుపై నుంచి శంషాబాద్ నుంచి గచ్చిబౌలి వెళ్తుండగా.. ఎయిర్ పోర్ట్ కాలనీ వద్దకు రాగానే ఒక్కసారిగా కారు ఇంజిన్‌ లో నుంచి మంటలు చెలరేగాయని లారీ డ్రైవర్లు చెప్పారన్నారు పోలీసులు.

Tagged Hyderabad, car, Shamshabad, outer ring road, , Fire break

Latest Videos

Subscribe Now

More News