గెలాక్సీ ప్లాజాలో మంటలు.. మూడో అంతస్తు నుంచి దూకేసిన జనం

గెలాక్సీ ప్లాజాలో మంటలు.. మూడో అంతస్తు నుంచి దూకేసిన జనం

ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఓ భవనంలో మంటలు చెలరేగడంతో ఒక వ్యక్తి తన ప్రాణాలను కాపాడుకోవడానికి భవనం మూడవ అంతస్తు నుంచి దూకడం అందర్నీ షాక్ కు గురి చేసింది. దీనికి సంబంధించి ఓ వీడియో కూడా బయటికి వచ్చింది. ఈ షాకింగ్ వీడియోలో ఒక వ్యక్తి "అరె కుడ్ జా" (ఇప్పుడే దూకు) అని చెప్పడం వినవచ్చు. ఎందుకంటే మంటల్లో చిక్కుకున్న స్థలం నుంచి ఎలాగోలా బయటకు వచ్చిన ఆ వ్యక్తి.. తన ప్రాణాలను రక్షించుకోవడానికి భవనంపై నుంచి దూకాడు. అయితే దూకిన వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడా లేదా అన్నది మాత్రం ప్రస్తుతానికి స్పష్టంగా తెలియరాలేదు. కాగా ఈ అగ్నిప్రమాదానికి షార్ట్‌సర్క్యూటే కారణమని చెబుతున్నారు.

Fire broke out on the third floor of galaxy plaza, gaur avenue 1, #GreaterNoida. People saved their lives by jumping from the building. pic.twitter.com/QJEZoORrXv

— Nikhil Choudhary (@NikhilCh_) July 13, 2023

 

ఈ సంఘటన ఈ ఏడాది జూన్‌లో జరిగిన ముఖర్జీ నగర్ సంఘటనను గుర్తుచేసింది. ఢిల్లీలోని రద్దీగా ఉండే ముఖర్జీ నగర్‌లోని యుపీఎస్‌సీ కోచింగ్ సెంటర్‌లో మంటలు చెలరేగడంతో, విద్యార్థులు తాళ్లు, వైర్లు ఉపయోగించాల్సి వచ్చింది. కొంతమంది విద్యార్థులు మంటల నుంచి తప్పించుకోవడానికి పై అంతస్తు నుంచి కిందికి దూకారు.

అగ్ని ప్రమాదంపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేసి, నాన్‌ఫైర్ ఫిర్యాదుగా గుర్తించారు. అగ్ని ప్రమాదం కారణంగా దాదాపు 60 మందికి కాలిన గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. కోచింగ్ సెంటర్ భవనంపై నుంచి దూకడం వల్ల ఏసీ కంప్రెసర్‌ పై పడడంతో ఇద్దరు విద్యార్థులు తీవ్ర గాయాలపాలైనట్లు పోలీసులు తెలిపారు.