జగిత్యాల జిల్లా మెట్‌పల్లి వ్యవసాయ మార్కెట్లో అగ్నిప్రమాదం..

జగిత్యాల జిల్లా మెట్‌పల్లి  వ్యవసాయ మార్కెట్లో అగ్నిప్రమాదం..

జగిత్యాల జిల్లా మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సివిల్ సప్లై 5వ నంబర్ గోదాంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆదివారం (ఆగస్టు 10) గోదాంలో ఉన్న ఖాళీ బస్తాలు అంటుకోవడంతో ప్రమాదం చోటు చేసుకుంది. 

గోదాం నుంచి పెద్ద ఎత్తున పొగలు వస్తుండటంతో గమనించిన రైతులు ఫైర్ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది ఫైర్ ఇంజిన్ తో మంటలు అదుపులోకి తెచ్చారు. 

గోదాంలో 9 లక్షల వేస్టేజ్ గని బ్యాగ్స్ ఉన్నట్లు సమాచారం. బస్తాలకు ఒకదానికొకటి మంటలు అంటుకోవడంతో గోదాం నిండా పొగలు కమ్ముకున్నాయి. జగిత్యాల, భీంగల్ ఫైర్ ఇంజిన్ల ద్వారా మంటలను అదుపులోకి తెచ్చారు.