నోష్ ఫార్మా ల్యాబ్‌‌‌‌ లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు

నోష్ ఫార్మా ల్యాబ్‌‌‌‌ లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు

చిట్యాల, వెలుగు : నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలోని పిట్టంపల్లి గ్రామ శివారులో ఉన్న నోష్ ఫార్మా ల్యాబ్‌‌‌‌ బ్లాక్–2లో గురువారం రియాక్టర్ వద్ద ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న ఇద్దరు కార్మికులు గాయపడ్డారు. వారిని చౌటుప్పల్‌‌‌‌లోని ఆస్పత్రికి తరలించారు.  సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదానికి గల కారణాలపై తెలియాల్సి ఉంది.