హైదరాబాద్లో మరో అగ్ని ప్రమాదం..అల్వాల్లోని కార్ షోరూమ్లో మంటలు

హైదరాబాద్లో  మరో అగ్ని ప్రమాదం..అల్వాల్లోని కార్ షోరూమ్లో మంటలు

హైదరాబాద్  ఇవాళ మరో అగ్ని ప్రమాదం జరిగింది.  అల్వాల్ లోని ట్రూ వ్యాలీ కార్ షో రూమ్ లో మంటలు చెలరేగాయి.  ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను  ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు .దట్టమైన పొగలు అలుముకోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.ప్రాణహానీ లేనప్పటికీ భారీగా నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.  స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు,అధికారులు ప్రమాదంపై ఆరాదీస్తున్నారు. 

ఉదయం సికింద్రాబాద్ లోని దాచా కంప్లెక్స్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.. కంప్లెక్స్ లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఫైర్ సేఫ్టీ సామాన్లు అమ్మే షాపులు, గొడౌన్స్ ఉన్న కాంప్లెక్స్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించాయి.ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు.