- విద్యార్థినులు కాలేజీలో ఉండటంతో
- తప్పిన ప్రాణాపాయం.. సిరిసిల్లలో ఘటన
హైదరాబాద్, వెలుగు: రాజన్న సిరిసిల్ల ప్రభుత్వ మెడికల్ కాలేజీ టెంపరరీ గర్ల్స్ హాస్టల్ లో బుధవారం ఉదయం 10 గంటలకు అగ్ని ప్రమాదం జరిగింది. హాస్టల్లోని ఒక గదిలో ఒక్కసారిగా మంటలు చెలరేగి, విద్యార్థినుల దుస్తులు, పుస్తకాలు, ఇతర వస్తువులు కాలిబూడిదయ్యాయి. ఈ ఘటన సమయంలో విద్యార్థినులు కాలేజీలో ఉండటంతో ప్రాణాపా యం తప్పింది. గదిలో నుంచి పొగలు రావ డాన్ని గమనించిన హాస్టల్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై మంటలను ఆర్పేశారు. ఈ ప్రమా దంపై హెల్త్‌కేర్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేష న్(హెచ్ఆర్డీఏ) ఆగ్రహం వ్యక్తం చేసింది.
కొత్తగా ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీల్లో మౌలిక సదుపాయాల లేమిని ఈ ఘటన ఎత్తి చూపుతోందని మండిపడింది. ఈ ఘటనపై డీఎంఈ నరేంద్ర కుమార్ వివరణ ఇచ్చారు. ప్రమాదం జరిగిన గదిలో ఇద్దరు విద్యార్థినులే ఉంటున్నారని.. ప్రాథమిక విచారణ ప్రకారం.. ఒక విద్యార్థిని ఉదయం పూజ చేసి దీపాన్ని ఆర్పకుండా వెళ్లిపోయిందని, మరోవైపు చార్జర్ ప్లగ్ కనెక్ట్ చేసి ఉందన్నారు. వీటి వల్లే మంటలు అంటుకున్నట్లు గుర్తించామని పేర్కొన్నారు.
