హైదరాబాద్ పాత బస్తీ శాలిబండలో భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్ పాత బస్తీ శాలిబండలో భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్: హైదరాబాద్ శాలిబండ క్లాక్ టవర్ సెంటర్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. క్లాక్ టవర్ సెంటర్ సమీపంలో ఉన్న ఒక బిల్డింగ్ మంటల్లో కాలిపోయింది. ఫోర్ వీలర్ అదుపు తప్పి ఆ బిల్డింగ్ను ఢీ కొట్టడంతో పెద్ద ఎత్తున మంటలు రావడం.. ఆ బిల్డింగ్ లోకి మంటలు వ్యాపించడం నిమిషాల్లో జరిగిపోయింది. స్థానికులు ఫైర్ డిపార్ట్ మెంట్కు సమాచారం అందించారు. 

అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన స్పందించి స్పాట్కు చేరుకున్నారు. మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తు్న్నారు. కాలిపోతున్న బిల్డింగ్ లాల్ దర్వాజ క్రాస్ రోడ్స్ దగ్గరలోని గోమతి ఎలక్ట్రానిక్స్గా తెలిసింది. మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. 8 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో కొందరు సిబ్బంది ఎలక్ట్రానిక్ షోరూంలోనే ఉన్నట్లు తెలిసింది. 

కొందరికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. మంటలు భారీగా ఎగసిపడుతుండటంతో చుట్టుపక్కల ఇళ్లలో ఉన్న వారిని పోలీసులు ఖాళీ చేయించారు. మంటల ధాటికి ఎలక్ట్రానిక్ వస్తువులు పేలిపోతూ పెద్ద ఎత్తున శబ్దాలు, మంటలు వస్తుండటంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు.