యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి భారీగా హుండీ ఆదాయం వచ్చింది. సోమవారం (నవంబర్ 24) హుండీ ఆదాయాన్ని లెక్కించారు అధికారులు, ఆలయ సిబ్బంది. 63 రోజుల హుండీ ఆదాయాన్ని లెక్కించగా మొత్తం 4 కోట్ల 80 లక్షల 77 వేల 919 రూపాయల నగదు సమకూరినట్లు ఆలయ ఈవో వెంకట్ రావు తెలిపారు.
అదేవిధంగా 63 రోజులలో వెండి బంగారం కూడా భారీగా వచ్చినట్లు తెలిపారు. 177 గ్రాముల మిశ్రమ బంగారం, 9 కిలోల 700 గ్రాముల మిశ్రమ వెండి హుండీకి వచ్చినట్లు తెలిపారు. కార్తీక మాసం సందర్భంగా భక్తులు భారీగా తరలి రావటంతో 63 రోజుల్లో హుండీ ఆదాయం భారీగా పెరిగినట్లు చెబుతున్నారు ఆలయ అధికారులు.
అంతకు ముందు 2025 జూన్ 14,15 తేదీలలో హుండీని లెక్కించారు. 44 రోజుల్లో 4కోట్ల 47లక్షల 66వేల 560 రూపాయల నగదు వచ్చినట్లు ఈవో తెలిపారు. 115 గ్రాముల మిశ్రమ బంగారం,6 కేజీల50 గ్రాముల మిశ్రమ వెండి, పలు దేశాల కరెన్సీని కానుకల రూపంలో భక్తులు సమర్పించినట్లు ఆలయ అధికారులు చెప్పారు.
