కంగ్టి కాటన్ మిల్లులో అగ్ని ప్రమాదం

కంగ్టి కాటన్ మిల్లులో అగ్ని ప్రమాదం
  • కాలి బూడిదైన 3 వేల క్వింటాళ్లపైగా పత్తి 
  • రూ. 2. 50 కోట్ల ఆస్తి నష్టం

కంగ్టి, వెలుగు: సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తుర్కా వడ్గవ్ శివారులోని శ్రీ సమర్థ్ కాటన్ మిల్లులో ఆదివారం ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. మిల్లు గోడౌన్ లో నిల్వ ఉంచిన పత్తిని మినీ ట్రాక్టర్ తో అన్ లోడ్ చేస్తుండగా ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దాదాపుగా 3 వేల క్వింటాళ్లకుపైగా పత్తి  కాలి బూడిదైంది.  సిబ్బంది మంటలకు ఆర్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేదు. భారీ ఎత్తున మంటలు చెలరేగడంతో వెంటనే ఫైర్ ఇంజన్ కు సమాచారం అందించారు.

ఫైర్​ సిబ్బంది వెళ్లి మంటలను అదుపులో తెచ్చారు.  ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. రూ. 2.50 కోట్లకుపైగా ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు. నారాయణఖేడ్ డీఎస్పీ వెంకట్ రెడ్డి, సీఐ వెంకట్ రెడ్డి, ఎస్ఐ దుర్గారెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.