శంకర్‌‌‌‌పల్లిలో అగ్నిప్రమాదం

శంకర్‌‌‌‌పల్లిలో అగ్నిప్రమాదం

శంకర్ పల్లి,వెలుగు: శంకర్‌‌‌‌పల్లి టౌన్‌‌లో -చేవెళ్ల వెళ్లే రోడ్డులోని ఓ కిరాణ దుకాణంలో ఆదివారం రాత్రి 10.30 గంటల సమయం లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి.  కిరాణ దుకాణం కావడం, లోపల ప్లాస్టిక్ వస్తువులు ఎక్కువ ఉండడంతో మంటలు వేగంగా వ్యాపించాయి.

స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో..  వారు చేవెళ్లలోని ఫైర్  సిబ్బందికి సమాచారం అందించారు.   ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు.