విశాఖ ఎస్బీఐ బ్యాంక్ లో అగ్ని ప్రమాదం

విశాఖ ఎస్బీఐ బ్యాంక్ లో  అగ్ని ప్రమాదం

విశాఖపట్నం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో  భారీ అగ్ని ప్రమాదం. విశాఖలోని జైల్ రోడ్డులోని  ఎస్బీఐ కార్యాలయంలో అక్టోబర్ 31న ఉదయం ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. ఘటనా స్థలానికి చేరుకున్న  నాలుగు ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పారు. 

ఈ ఘటనలో కీలక ఫైళ్లు, కంప్యూటర్లు, పలు  వస్తువులు ధ్వంసం అయ్యాయి. దీపావళి ఫెస్టివల్ కావడంతో సిబ్బంది ఎవరూ కూడా ఆఫీసులో లేరు.  షాట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అగ్ని ప్రమాదం వెనుక ఏదైనా కుట్ర కోణం ఉందా? లేదా అగంతకుల పనా? అనే కోణంలో దర్యాప్తుచేస్తున్నారు  పోలీసులు