అగ్రిప్రమాదంలో దొరికిన హవాలా డబ్బుపై దర్యాప్తు ముమ్మరం

అగ్రిప్రమాదంలో దొరికిన హవాలా డబ్బుపై దర్యాప్తు ముమ్మరం

సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్ లోని ఓ ఇంట్లో లెక్కపత్రాలు లేని డబ్బు గుర్తించామని గోపాలపురం సీఐ ఈశ్వర్ గౌడ్ తెలిపారు. మే 14వ తేదీ ఆదివారం ఉదయం  గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే..ఈ ప్రమాదం జరిగిన ఇంట్లో రూ.కోటి నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా గోపాలపురం సీఐ ఈశ్వర్ గౌడ్ మీడియాకు వివరాలు వెల్లడించారు. 

"అగ్నిప్రమాదం జరిగిన ఇంట్లో భారీగా డబ్బు ఉన్నట్లు సమాచారం వచ్చింది. ఇంటి ఓనర్ ఆ సమయంలో ఇంట్లో లేరు. ఇద్దరి మధ్యవర్తుల సమక్షంలో ఇంట్లో సెర్చ్ చేశాము. తనిఖీల్లో పత్రాలు లేని రూ.కోటి 65 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నాం. డబ్బుతో పాటు గోల్డ్, సిల్వర్ స్వాధీనం చేసుకున్నాము. పట్టుబడ్డ డబ్బు ఇల్లీగల్, హవాలా మనీగా మాకు సమాచారం ఉంది. ఐటీ అధికారులకు సంచారం ఇచ్చాము. ఈ కేసుకు సంబంధించిన మరింత సమాచారం కోసం లోతుగా దర్యాప్తు చేస్తున్నాము" అని సీఐ వివరించారు.

సికింద్రాబాద్: గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని రెజిమెంటల్ బజార్ ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.. ప్రమాదం జరిగిన ఇంట్లో కోటి, అరవై నాలుగు లక్షల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అగ్నిప్రమాదం జరిగినప్పుడు ఇంట్లో ఇంటి ఓనర్లు ఎవరు లేరు. ఇంటి ఓనర్ శ్రీనివాస్ గా గుర్తించిన పోలీసులు.. అతడు ఓ ప్రముఖ కంపెనీలో డీజీఎంగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. అదే కంపెనీకి సంబంధించిన గవర్నమెంట్ ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ వ్యాపారం చేస్తున్నట్లు స్థానికులు పేర్కొన్నారు. 

అగ్నిప్రమాద సమయంలో హైదరాబాద్ లో లేని శ్రీనివాస్ వైజాగ్ వెళ్లినట్లు సమాచారం. అగ్ని ప్రమాదం తర్వాత బెడ్ రూమ్ లో క్యాష్ సేఫ్ గా ఉందా లేదా అని బంధువులు చూస్తుండగా పోలీసులకు సమాచారం వచ్చింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తనిఖీ చేసి రూ.కోటి 65 లక్షల.46 వేల నగదు, బంగారం, వెండి స్వాధీనం చేసుకొన్నారు. ఐటీ అధికారులకు సమాచారం ఇచ్చి సీజ్ చేసిన నగదు, బంగారాన్ని గోపాలపురం పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు సీఐ ఈశ్వర్ గౌడ్ తెలిపారు. ఈ నగదు హవాల మనీగా అనుమానిస్తున్న పోలీసులు పలు కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. వైజాగ్ నుండి ఇంటి ఓనర్ వచ్చిన తర్వాత పూర్తి సమాచారం తెలియనున్నదని సీఐ తెలిపారు.