బేగంపేట దగ్గర కారులో మంటలు..భారీగా ట్రాఫిక్ జామ్

బేగంపేట దగ్గర కారులో మంటలు..భారీగా ట్రాఫిక్ జామ్

హైదరాబాద్ బేగంపేట దగ్గర రన్నింగ్ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రకాశ్ నగర్ దగ్గర పక్కనే నిలిపి ఉన్న ఓమ్ని వాహనంలో ఒక్కసారిగా మంటలు రావడంతో అందులో ఉన్న డ్రైవర్ అప్రమత్తమై వాహనంలో నుండి బయటకు రావడంతో ప్రమాదం తప్పింది. వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

మంటలకు  ఓమ్నీ వ్యాన్ పూర్తిగా దగ్ధమైంది.  స్కూలు విద్యార్థులను తీసుకువెళ్ళే వాహనంగా అగ్ని మాపక అధికారులు తెలిపారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాద ఘటనలో రోడ్డుపై కాసేపు భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.