జగద్గిరిగుట్టలో రాజీవ్​ గృహకల్పలో అగ్ని ప్రమాదం

 జగద్గిరిగుట్టలో రాజీవ్​ గృహకల్పలో అగ్ని ప్రమాదం

జీడిమెట్ల, వెలుగు: జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని రాజీవ్​గృహకల్పలో అగ్ని ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. రాజీవ్​గృహకల్ప బ్లాక్​నంబర్ 13, ఫ్లాట్​నంబర్​ 24లో  వెంకటన్న–అమీనా దంపతులు నివాసం ఉంటున్నారు. మంగళవారం ఉదయం 5.20 గంటల సమయంలో తాళం వేసి, ఊరెళ్లడానికి బస్టాండ్​కు వెళ్లారు. 

కాసేపటికే ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. గమనించిన చుట్టుపక్కల వారు వెంకటన్నకు ఫోన్​లో సమాచారం ఇవ్వడంతో తిరిగి వచ్చారు. ఈ ప్రమాదంలో ఇంట్లోని టీవీ, ఫ్రిడ్జ్ , దుస్తులు, ఇతర వస్తువులన్నీ కాలిపోయాయని బాధితుడు తెలిపారు. షార్ట్ సర్క్యూట్​వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు.