తెలంగాణాలో కౌంటింగ్‌‌‌‌ కేంద్రాల వద్ద ఫైర్ ఇంజన్లు

తెలంగాణాలో  కౌంటింగ్‌‌‌‌ కేంద్రాల వద్ద  ఫైర్ ఇంజన్లు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు : ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద  అనుకోని అగ్నిప్రమాదం సంభవిస్తే  వెంటనే స్పందించేందుకు ఫైర్ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సెంటర్ల వద్ద ఫైర్‌‌‌‌ ఇంజన్లు, మిస్ట్‌‌‌‌ బుల్లెట్లు, మంటలు ఆర్పే పరికరాలను అందుబాటులో ఉంచింది.

కేంద్రాల వద్ద విధుల్లో ఉండే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించినట్టు ఫైర్ సర్వీసెస్‌‌‌‌  డీజీ వై నాగిరెడ్డి శనివారం తెలిపారు. ప్రమాదాలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంటుబన్నట్టు వెల్లడించారు.