మాదాపూర్, వెలుగు: మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రన్నింగ్కారులో మంటలు చెలరేగి, కారు ముందు భాగం పూర్తిగా కాలిపోయింది. పోలీసుల వివరాల ప్రకారం.. మైండ్స్పేస్నుంచి జేఎన్‌టీయూ రూట్‌లో సోమవారం ఓ మహిళా కారులో వెళ్తోంది. కారు సైబర్ టవర్స్ఫ్లై ఓవర్దిగే టైంలో ఒక్కసారిగా కారు ఇంజన్నుంచి మంటలు చెలరేగాయి. డ్రైవింగ్‌చేస్తున్న మహిళ వెంటనే కారును పక్కకు ఆపింది. సమాచారం అందుకున్న మాదాపూర్ట్రాఫిక్ఇన్స్పెక్టర్ నర్సయ్య, సిబ్బందితో అక్కడికి చేరుకుని స్థానికులతో కలిసి మంటలను ఆర్పి వేశారు. ఐటీ ఉద్యోగులు ఆఫీసుల నుంచి ఇండ్లకు వెళ్లే సమయం కావడంతో మైండ్‌స్పేస్ నుంచి జేఎన్‌టీయూ వెళ్లే రోడ్డులో ట్రాఫిక్‌జామ్ అయింది. షార్ట్‌సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. డ్రైవింగ్ చేసిన మహిళ ప్రమాదం జరగ్గానే ఆటోలో అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంపై ఎలాంటి కంప్లైంట్ రాలేదని మాదాపూర్ పోలీసులు తెలిపారు.
