
హైదరాబాద్ నాంపల్లి రైల్వేస్టేషన్‌లో చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ప్లాట్‌ఫాం నెంబర్ 6లో నిలిచి ఉన్న చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లో ఒక్కసారిగా దట్టమైన పొగలు చేలరేగాయి. దీంతో అలర్టైన రైల్వే సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే రైలు నిలిచి ఉండటం… అందులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు రైల్వే అధికారులు తెలిపారు.