
ఢిల్లీ : ఇంటి అద్దె కట్టాలంటూ ఒత్తిడి తెచ్చిన తొమ్మిది మంది ఇంటి యజమానులపై పోలీసులు కేసు నమోదు చేశారు. నార్త్‌వెస్ట్ జిల్లాలోని ముఖర్జినగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఢిల్లీ విశ్వవిద్యాలయంలో చదువుతున్న విద్యార్థులు.. కాలేజీకి దగ్గర్లో ఉన్న ఇళ్లలో పేయింగ్ గెస్టులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో అద్దె కట్టాలంటూ విద్యార్థులపై ఒత్తిడి తెచ్చారు. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో తొమ్మిది మంది ఇంటి యజమానులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 188 కింద ఇంటి యజమానులపై కేసు నమోదైంది. ఈ కేసులో ఇంటి యజమానులకు నెలరోజుల పాటు జైలు శిక్ష లేదా రూ.200 ల జరిమానా లేదా రెండూ విధించవచ్చని పోలీసులు చెప్పారు.