మొదట వోకల్ ఫర్ లోకల్.. తర్వాతే లోకల్ ఫర్ గ్లోబల్: ప్రధాని బర్త్డే మెసేజ్

మొదట వోకల్ ఫర్ లోకల్.. తర్వాతే లోకల్ ఫర్ గ్లోబల్: ప్రధాని బర్త్డే మెసేజ్

రాబోయే పండుగల సీజన్ లో ప్రతి ఒక్కరూ బాధ్యతగా స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయాలని.. ఆదివారం( సెప్టెంబర్ 17) తన పుట్టిన రోజు సందర్భంగా వోకల్ ఫర్ లోకల్ నినాదాన్ని వినిపిం చారు ప్రధాని మోదీ. స్థానిక ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లకు తీసుకెళ్లే లక్ష్యంతో పనిచేస్తున్నామని స్పష్టం చేశారు మోదీ. 

స్థానికంగా తయారైన  ఉత్పత్తులు  ప్రపంచ మార్కెట్లకు చేరుకోవాలంటే మొదట వోకల్ ఫర్ లోకల్ కి గొంతు వినిపించాలి.. ఆ తర్వాత లోకల్ ని గ్లోబల్ చేయాలని పిలుపునిచ్చారు. గణేష్ చతుర్థి, ధంతేరస్, దీపావళి వంటి రాబోయే పండుగల్లో స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయాలని దేశ పౌరులను కోరారు ప్రధాని మోదీ. 

Also Read :- యశోభూమి’ రూపకల్పనలో విశ్వకర్మల నైపుణ్యం: ప్రధాని మోదీ

వోకల్ ఫర్ లోకల్ లో భాగస్వామ్యం కావాల్సిన బాధ్యత యావత్ దేశంపై ఉందని, విశ్వకర్మ కళాకారులు అనే ట్యాగ్ ఉన్న ఉత్పత్తులను చిన్నా, పెద్దా తేడా లేకుండా కొనుగోలు చేయాలని ప్రజలను మోదీ కోరారు. 

జిఎస్‌టి -నమోదిత దుకాణాల నుంచి 'మేడ్ ఇన్ ఇండియా' టూల్‌కిట్‌లను కొనుగోలు చేయాలని హస్తకళాకారులను కోరారు ప్రధాని మోదీ.