యశోభూమి’ రూపకల్పనలో విశ్వకర్మల నైపుణ్యం: ప్రధాని మోదీ

యశోభూమి’ రూపకల్పనలో విశ్వకర్మల నైపుణ్యం: ప్రధాని మోదీ

ఢిల్లీ నగరం ప్రాచీన కట్టడాలు, దర్శించదగ్గ క్షేత్రాలకు నిలయం. దేశ రాజధాని ఢిల్లీ కీర్తి కిరీటంలో మరో మణిహారం చేరింది. ఇటీవల జీ20లో భారత మండపం ప్రారంభించిన ప్రధాని మోదీ.. ఇవాళ (సెప్టెంబర్ 17)న  అద్భుత తమైన ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్ పో సెంటర్( యశోభూమి)ని ప్రారంభించారు.  

ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. సభలు, సమావేశాలు, ఎగ్జిబిషన్ల కోసం ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలతో ద్వారకలో నిర్మించిన యశోభూమి నేటి నుంచి అందుబాటులోకి ఉంటుందన్నారు మోదీ. యశోభూమి నిర్మాణానికి పనిచేసిన విశ్వకర్మ సోదరులు, సోదరీమణుల దృఢత్వం, సంకల్పం ప్రతిబింబిస్తున్నని ప్రశంసించారు మోదీ. 

యశోభూమిఅలో 11 వేలమంది ఒకేసారి కూర్చునే సౌకర్యం ఉంది. మెయిన్ హాల్, గ్రాండ్ బాల్ రూమ్ తో సహా 8 అంతస్తుల భవనాన్ని 73 వేల చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో నిర్మించారు. ఇందులో 15 కాన్ఫరెన్స్ హాల్స్ ఉన్నాయి. ఇక్కడ సమావేశాల తోపాలు సదస్సులు, ప్రదర్శనలు కూడా నిర్వహించవచ్చన్నారు ప్రధాని మోదీ.