
ట్రిపుల్ తలాక్ బిల్లు చట్ట రూపం దాల్చాక… మహారాష్ట్రలో తొలి కేసు నమోదైంది. తనకు వాట్సప్ లో ట్రిపుల్ తలాక్ మెసేజ్ పంపించాడంటూ ఓ వివాహిత ….థానెలోని ముంబ్రా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కొడుకు పుట్టినా తన భర్త పట్టించుకోవడం లేదని ఇంత వరకు చూడడానికి కూడా రాలేదని బాధిత మహిళ ఆరోపించింది. ఇతరులతో ఎఫైర్ ఉందని , ఫోన్ చేసి తలాక్ అంటూ చెప్పి పెట్టేశాడని చెప్పింది. వాట్సప్ లోనూ తలాక్ అంటూ మెసేజ్ పంపించాడని …పీఎస్ లో ఫిర్యాదు చేసింది బాధిత మహిళ.