నేటి నుంచి ఫస్ట్ డోస్​ బంద్‌‌‌‌‌‌‌‌

నేటి నుంచి ఫస్ట్ డోస్​ బంద్‌‌‌‌‌‌‌‌

సెకండ్ డోస్​ వాళ్లకే వ్యాక్సిన్‌‌‌‌‌‌‌‌..  ఈ నెల 12 వరకూ అంతే
ఆదివారం నో వ్యాక్సినేషన్​
సెకండ్ డోస్​కు ఆన్​లైన్​ రిజిస్ట్రేషన్​ అక్కర్లేదు.. సెంటర్ల వద్దే రిజిస్ట్రేషన్
టీకా కొనుగోలు కోసం ఇండెంట్ పెట్టలేదు:  డీహెచ్​ శ్రీనివాసరావు 
కేంద్రం నుంచి మరో 51 ఆక్సిజన్​ సెల్ఫ్​ జనరేటర్లు : డీఎంఈ రమేశ్​రెడ్డి


కేంద్రం నుంచి 51 ఆక్సిజన్​ జనరేటర్లు రాష్ట్రంలో ఆక్సిజన్ రిక్వైర్‌‌‌‌మెంట్ రోజు రోజుకూ పెరుగుతోందని మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్  డాక్టర్ రమేశ్‌‌రెడ్డి చెప్పారు. ప్రస్తుతం రోజూ 430 మెట్రిక్ టన్నులను కేంద్రం మన రాష్ట్రానికి కేటాయించిందని, దీన్ని ఐదొందల మెట్రిక్​ టన్నులకు పెంచాలని కోరినట్లు తెలిపారు.  కేంద్రం ఇప్పటికే ఐదు ఆక్సిజన్ సెల్ఫ్ జనరేటర్లను కేటాయించగా, ఇప్పుడు ఇంకో 51 ఆక్సిజన్ సెల్ఫ్​ జనరేటర్లను కేటాయించిందని వెల్లడించారు. వీటిని నెల రోజుల్లో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.

  
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. నిన్నటి వరకూ ఆన్​లైన్​ రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే వ్యాక్సిన్ అంటూ జనాలను ఇబ్బంది పెట్టిన సర్కార్.. ఇప్పుడు ఏకంగా ఫస్ట్ డోస్​ ఇవ్వబోమంది. ఫస్ట్ డోస్​ వేసుకోవాలనుకునేవాళ్లకు శనివారం నుంచి ఈ నెల 12 వరకూ వ్యాక్సినేషన్‌‌ను రద్దు చేసింది. ఈ నాలుగు రోజులూ (9వ తేదీ వ్యాక్సినేషన్​ పూర్తిగా బంద్​) సెకండ్ డోస్​ వాళ్లకే వ్యాక్సిన్ ఇస్తామని, కొత్తవాళ్లకు ఇవ్వబోమని తెలిపింది. కొవిషీల్డ్ తీసుకుని 42 రోజులు, కొవాగ్జిన్ తీసుకుని 28 రోజులు పూర్తయిన వాళ్లందరూ వచ్చి సెకండ్ డోస్​ తీసుకోవచ్చని సూచించింది. ఆన్‌‌లైన్ రిజిస్ట్రేషన్ ఏమీ అక్కర్లేదని, నేరుగా సెంటర్ల వద్దే రిజిస్ట్రేషన్ చేస్తామని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్  డాక్టర్ శ్రీనివాసరావు చెప్పారు. మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రమేశ్‌‌రెడ్డితో కలిసి ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఈ నెల 15 వరకూ 4,99,432 మందికి, 16వ తేదీ నుంచి 31 తేదీ వరకూ మరో 14,92,825 మందికి సెకండ్ డోస్​  వేయాల్సి ఉందని శ్రీనివాసరావు వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,74,900 వ్యాక్సిన్ డోసులు ఉండగా, ఈ నెల 15 వరకూ మరో 3.11 లక్షల డోసులు వస్తాయని ఆయన చెప్పారు. ఇందులో కొవిషీల్డ్, కొవాగ్జిన్​ రెండూ ఉన్నాయన్నారు. ఇవిగాక ఇంకో 13 లక్షలకుపైగా డోసులు వస్తే తప్ప, సెకండ్ డోస్​ వాళ్లకు సరిపోవని వివరించారు. దీంతో శనివారం నుంచి సెకండ్ డోసు వాళ్లకే వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించామన్నారు. వ్యాక్సిన్ లభ్యతను బట్టి, సెకండ్ డోసు వాళ్లకు పూర్తయ్యాకే ఫస్ట్‌‌ డోసు ఇచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఈ నెల 9న(ఆదివారం) వ్యాక్సినేషన్ పూర్తిగా బంద్ పెడుతున్నామని తెలిపారు. ఫస్ట్ డోసు ప్రైవేట్ సెంటర్లలో తీసుకున్నవాళ్లు కూడా సెకండ్ డోసు గవర్నమెంట్ సెంటర్లలో తీసుకోవచ్చని డీహెచ్ స్పష్టం చేశారు. ఎవరైనా ఎక్కడైనా సెకండ్ డోసు తీసుకోవచ్చని, ఫస్ట్ డోసు తీసుకున్న సెంటర్‌‌‌‌లోనే సెకండ్ డోసు తీసుకోవాలన్న రూల్ ఏమీ లేదన్నారు.  స్లాట్ బుకింగ్‌‌లో సెకండ్ డోసు వాళ్లకు ప్రయారిటీ ఇచ్చేలా కొవిన్ సాఫ్ట్‌‌వేర్‌‌‌‌లో మార్పులు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశామన్నారు.
వ్యాక్సిన్​ కొనుగోలుకు ఇండెంట్ పెట్టలేదు
వ్యాక్సినేషన్ కొనుగోలుకు ఇండెంట్ ఏం పెట్టలేదని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. వ్యాక్సినేషన్ కేటాయింపు కేంద్రం కంట్రోల్‌‌లోనే ఉందన్నారు. రాష్ట్ర సర్కార్ కొనడానికి సిద్ధంగా ఉన్నా వ్యాక్సిన్ లేక కొనలేకపోతున్నామని చెప్పారు. 18–44 వాళ్లకూ  కేంద్రమే వ్యాక్సిన్ అందజేస్తోందన్నారు. ఈ ఏజ్ గ్రూప్ వాళ్లు ఓపిక పట్టాలని చెప్పారు. మరో 3, 4 వారాల్లో సెకండ్ వేవ్ తగ్గిపోవచ్చని చెప్పారు. అన్ని సర్కారు దవాఖాన్లలో ఫీవర్ ఓపీ నిర్వహిస్తున్నామన్నారు. శుక్రవారం 1.4 లక్షల మంది ఓపీకి వచ్చారని, ఇందులో 19 వేల మందికి కరోనా లక్షణాలు ఉన్నాయని డీహెచ్ చెప్పారు. ఈ 19 వేల మందికి హోమ్ ఐసోలేషన్ కిట్లు ఇచ్చామన్నారు. అవసరమైన వాళ్లకే కిట్లు ఇస్తామని చెప్పారు. ఇంటింటి సర్వేకు 20 వేలకుపైగా టీమ్స్ ఉన్నాయని, ఇప్పటివరకూ 11.2 లక్షల ఇండ్లను ఈ టీమ్స్ విజిట్ చేశాయని తెలిపారు.