
డయాబెటిస్ ఉన్నవాళ్లు తీపిపదార్దాలు తినకూడదు. అలాగే, డైట్లో ఉన్నవాళ్లు క్యాలరీలు, షుగర్ పెరుగుతుందోమోననే భయంతో స్వీట్లు, మఫిన్స్, పేస్ట్రీలు వంటి వాటికి ‘నో’ చెప్తారు. కానీ, పాలస్తీనాలోని గాజాలో ఉండే వాళ్లకు ఈ ఇబ్బంది లేదు. అందరికి హెల్దీఫుడ్ అందించాలని అక్కడ మొదటి ‘హెల్దీహోమ్’ స్టోర్ పెట్టింది హనా అల్ వకీల్ అనే 32 ఏండ్ల అమ్మాయి.
గాజాలో రెండు నెలల క్రితం ‘హెల్దీహోమ్’ని మొదలుపెట్టింది హనా. యూనివర్సిటీలో ఆప్టిక్స్ సబ్జెక్ట్ చదివింది. ఆప్టోమెట్రిస్ట్ (కంటి స్పెషలిస్ట్)గా కొన్నిరోజులు పనిచేసింది. అయితే, ఇజ్రాయెల్ సైన్యం ఆమె పనిచేసే ప్లేస్‌ని బాంబులతో ధ్వంసం చేసింది. దాంతో కొత్త ఫీల్డ్‌లోకి మారాలనుకుంది హనా. చిన్నప్పటి డ్రీమ్ అయిన స్వీట్ షాప్ పెట్టాలి అనుకుంది. గాజాలో దాదాపు 23 లక్షల జనాభా ఉంటుంది. వీళ్లలో లక్షమందికిపైగా డయాబెటిస్తో ఇబ్బంది పడుతున్నారని హెల్త్ రికార్డులు చెప్తున్నాయి. తమ ప్రాంతంలో డయాబెటిస్ ఉన్నవాళ్లకు, డైట్ పాటించేవాళ్లకు హెల్దీ ఫుడ్ దొరక్కపోవడం చూసింది హనా. మార్కెట్లో ఎక్కడ చూసినా ప్రిజర్వేటివ్స్ కలిపిన ఫుడ్ మాత్రమే దొరికేది. దాంతో హెల్దీఫుడ్ని తనే తయారుచేసి అమ్మాలనుకుంది. షుగర్ బదులు స్వీట్నర్ తన ఆలోచనకి కుకింగ్, బేకింగ్ తెలియడం కూడా కలిసొచ్చింది. రెండు నెలల క్రితం తన ఇంటి దగ్గరే ‘హెల్దీహోమ్’ స్టోర్ మొదలుపెట్టింది. తక్కువ క్యాలరీలు ఉండేవి, చక్కెర కలపని స్వీట్స్, మఫిన్స్, కేక్స్, బిస్కెట్స్, పేస్ట్రీలు అమ్ముతోంది. తీపి కోసం షుగర్ బదులు ‘స్టివియ’ మొక్కల ఆకుల నుంచి తయారుచేసిన ‘స్టివియ’ అనే స్వీట్నర్ని వాడుతుంది హనా. షుగర్‌కి ఆల్టర్నేట్గా ఉపయోగించే స్వీట్నర్గా అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అప్రూవల్ కూడా ఉంది దీనికి.