ముస్లిం మహిళల కోసం స్పెషల్ జిమ్.. రాష్ట్రంలో ఇదే ఫస్ట్

ముస్లిం మహిళల కోసం స్పెషల్ జిమ్.. రాష్ట్రంలో ఇదే ఫస్ట్

హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ సిటీలో ముస్లిం మహిళల కోసం ఓ మసీదు స్పెషల్ జిమ్‌‌ను ఏర్పాటు చేసింది. రాజేంద్రనగర్‌‌ పరిసర ప్రాంతాల్లోని ముస్లిం మహిళల కోసం జిమ్నాజియంను అందుబాటులోకి తీసుకొచ్చి అందరి మన్ననలు పొందుతోంది. రాష్ట్రంలో ఇలా ముస్లిం విమెన్ కోసం నిపుణుల ట్రెయినింగ్‌‌తో కూడిన జిమ్‌‌ను ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. మురికివాడల్లో నివసిస్తున్న మహిళలను సంక్రమిత వ్యాధుల బారి నుంచి రక్షించడానికే ఈ జిమ్‌‌ను ఏర్పాటు చేశారని తెలుస్తోంది.

ఈ జిమ్‌‌లో ప్రతిరోజూ సెషన్‌‌ల వారీగా ట్రెయినింగ్ ఇచ్చేందుకు ప్రొఫెషనల్ విమెన్ ట్రెయినర్‌‌ను రిక్రూట్ చేసుకున్నారు. అలాగే ఓ ఫిజీషియన్‌‌తోపాటు హెల్త్ కౌన్సెలర్స్ కూడా ఇందులో అందుబాటులో ఉండనున్నారు. రాజేంద్రనగర్‌‌, వాదీ మహమూద్ ప్రాంతంలోని మస్జీద్-ఏ-ముస్తఫాలో ఈ జిమ్‌‌ను ఏర్పాటు చేశారు. దీనికి అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న SEED అనే స్వచ్ఛంద సంస్థ ఆర్థిక చేయూతను అందించింది. హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ (హెచ్‌‌హెచ్ఎఫ్) మసీదు కమిటీతో కలసి వెల్‌నెస్ సెంటర్ నిర్వహణను చూసుకుంటోంది.