Lalbaugcha Raja 2025:ముంబై ఐకానిక్ గణేష్..లాల్ బాగ్ చా రాజా ఫస్ట్ లుక్ ఇదిగో..

Lalbaugcha Raja 2025:ముంబై ఐకానిక్ గణేష్..లాల్ బాగ్ చా రాజా ఫస్ట్ లుక్ ఇదిగో..

లాల్ బాగ్ ఛా రాజా 2025 ఫస్ట్ లుక్ గణేష్ చతుర్థికి ముందే విడుదలైంది. ఈ అన్ వీల్ తో లక్షలాది మంది భక్తుల ఎదురుచూపులు ముగిశాయి. గణేష్ చతుర్థి ఆగ
స్టు 27 నుంచి సెప్టెంబర్ 6 వరకు జరుపుకోనున్నారు. ఈ ఏడాది కూడా ముంబై లాల్ బాగ్ ఛా రాజా గణపతి భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.లాల్‌బాగ్ రాజుగా గౌరవించబడే ముంబై ఐకానిక్ విగ్రహం రాకతో ముంబై అంతటా ఉత్సాహం, భక్తిని రేకెత్తించింది.

2025 ఆగస్ట్ 24న సాయంత్రం 7 గంటలకు లాల్ బాగ్ ఛా రాజా ఫస్ట్ లుక్ అధికారికంగా విడుదల చేశారు. ఈ ఏడాది గణపతి విగ్రహాన్ని మజెంటా రంగు పూల అలంకరణతో, ఆకర్షణీయమైన కళాత్మకతతో రూపొందించారు. సంప్రదాయ పాటలు, డాన్సులతో విగ్రహాన్ని మండపానికి తీసుకొచ్చారు. 

లాల్ బాగ్ ఛా రాజా 2025 ఫస్ట్ లుక్ గణేష్ చతుర్థికి ముందే విడుదలైంది. ఈ అన్ వీల్ తో లక్షలాది మంది భక్తుల ఎదురుచూపులు ముగిశాయి.

సుమారు12 అడుగులు ఎత్తున్న ఈ లాల్ బాగ్ ఛా విగ్రహం ఆకర్షణగా నిలిచింది. లాల్ బాగ్ ఘాట్ వేదికపై ప్రత్యేకంగా నిర్వహించిన పూజాది కార్యక్రమాలు యువత నుంచివృద్ధుల వరకు అందరిని ఆకట్టుకున్నాయి..

చరిత్ర, విశిష్టత

లాల్ బాగ్ ఛా రాజా గణేషుని 1934నుంచి ప్రతిష్ట చేస్తున్నారు. లాల్‌బాగ్చా రాజా మూలాలు ఒక శతాబ్దం నాటివి. 1900ల ప్రారంభంలో పరేల్‌లోని లాల్‌బాగ్ ప్రాంతంలో వస్త్ర మిల్లులు ఆధిపత్యం చెలాయించాయి. గిరంగౌన్ లేదా 'మిల్లుల గ్రామం' అని పిలువబడే ఈ ప్రాంతం 1930ల పారిశ్రామిక సంక్షోభంతో తీవ్రంగా ప్రభావితమైంది. మిల్లు మూసివేతలు లెక్కలేనన్ని కార్మికులు ,వారి కుటుంబాల జీవితాలను అస్తవ్యస్తం చేశాయి. ఈ కష్టాల మధ్య సమాజం బలం ,మార్గదర్శకత్వం కోసం గణేశుడిని పూజించడం మొదలు పెట్టారు  ప్రజలు. 

అప్పటినుండి ప్రతి ఏటా భక్తి, సాంప్రదాయాల కలయికగా దేశవ్యాప్తంగా జరిగుతోంది. లక్షల్లో భక్తులు ముంబైకి చేరుకొని విగ్రహ దర్శనం, మొక్కులు తీర్చేందుకు వచ్చి ఆశీస్సులు పొందుతుంటారు. ఈ గణపతి మూర్తి నవసాచా గణపతి భక్తుల కోరికలు తీర్చే దేవుడు అనే భక్తి విశ్వాసంతో ప్రసిద్ధి చెందింది.

ఈసారి ప్రత్యేకతలు

డిజిటల్ లైవ్ దర్శనం, మండపం అలంకరణలు, భద్రతా ఏర్పాట్లు గణేష్ ఉత్సవాన్ని మరింత ప్రత్యేకంగా మార్చాయి. దేశ విదేశాలనుంచి దేశ విదేశాలనుంచి భక్తులు ఈ లాల్ బాగ్ ఛా గణేషుని దర్శించేందుకు వస్తుంటారు. 

2025లో గణేష్ చతుర్థి ఆగస్ట్ 27న ప్రారంభమై సెప్టెంబర్ 6 వరకూ వేడుకలు ముగుస్తాయి. 2025 లాల్ బాగ్ ఛా రాజా ఫస్ట్ లుక్ విడుదలతో గణేష్ చతుర్థి ఉత్సవ సంబురాలు దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి.