అవికాగోర్ షణ్ముఖ .. ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిలీజ్

అవికాగోర్ షణ్ముఖ .. ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిలీజ్

సెలెక్టివ్‌‌‌‌‌‌‌‌గా సినిమాలు చేస్తూ, ట్రెడిషనల్ క్యారెక్టర్స్‌‌‌‌‌‌‌‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది అవికాగోర్. ప్రస్తుతం ఆమె నటిస్తున్న చిత్రాల్లో ఒకటి ‘షణ్ముఖ’. ఆది సాయి కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు జంటగా కనిపించనుంది.  ఆదివారం తన బర్త్‌‌‌‌‌‌‌‌డే సందర్భంగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు ఆమె పాత్రను పరిచయం చేశారు మేకర్స్. ఇందులో అవికా.. సారా పాత్రలో కనిపించనుందని రివీల్ చేశారు. తెలుగుదనం ఉట్టిపడేలా చుడీదార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఉన్న ఆమె పోస్టర్ ఆకట్టుకుంటుంది.  ష‌‌‌‌‌‌‌‌ణ్ముగం సాప్పని ద‌‌‌‌‌‌‌‌ర్శకత్వంలో తుల‌‌‌‌‌‌‌‌సీరామ్, రమేష్ యాదవ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా ద‌‌‌‌‌‌‌‌ర్శక నిర్మాతలు మాట్లాడుతూ  ‘ఇదొక డివోషనల్ థ్రిల్లర్. అవికాగోర్   సాహ‌‌‌‌‌‌‌‌సోపేత‌‌‌‌‌‌‌‌మైన ప‌‌‌‌‌‌‌‌నులు చేసే శ‌‌‌‌‌‌‌‌క్తివంత‌‌‌‌‌‌‌‌మైన అమ్మాయి పాత్రలో  క‌‌‌‌‌‌‌‌నిపించ‌‌‌‌‌‌‌‌నుంది.  లక్ష్య సాధ‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌లో ఆది పాత్రకు స‌‌‌‌‌‌‌‌పోర్ట్ చేస్తూ ఆయ‌‌‌‌‌‌‌‌నకు తోడుగా నిలిచే క్యారెక్టర్.  ఆమె కెరీర్‌‌‌‌‌‌‌‌లో ఈ పాత్ర గుర్తుండిపోతుంది. అలాగే సినిమా కూడా మ‌‌‌‌‌‌‌‌రిచిపోలేని చిత్రంగా నిలిచిపోతుంది’ అని చెప్పారు.  రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.