
సూపర్ రాజా హీరోగా, దర్శక నిర్మాతగా రూపొందిస్తున్న చిత్రం ‘ఇలాంటి సినిమా మీరెప్పుడు చూసుండరు’. రమ్య ప్రియ, వంశీ గోనె ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సోమవారం ఈ మూవీ టైటిల్ లాంచ్ ప్రెస్‌మీట్‌ను ప్రసాద్ ల్యాబ్స్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్ రాజా మాట్లాడుతూ ‘రెండు గంటల సినిమాను సింగిల్ షెడ్యూల్‌లో రూపొందించా.
దాదాపు పదిహేను వందల డైలాగులు ఉన్నాయి. వాటిని బ్రేక్ లేకుండా చెప్పడం కోసం ఏడు నెలలు రిహార్సల్స్ చేశాం. అందర్నీ ఆశ్చర్యపరిచేలా సినిమా ఉంటుంది. ఫిబ్రవరిలో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నాం’ అని చెప్పాడు. కళామ తల్లి పాత్ర చేయడం సంతోషంగా ఉందని చెప్పింది రమ్య ప్రియ. వంశీ గోనె సహా టీమ్ అంతా పాల్గొన్నారు.