
అల్లరి నరేష్, అమృత అయ్యర్ జంటగా సుబ్బు తెరకెక్కిస్తున్న చిత్రం ‘బచ్చల మల్లి’. రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మిస్తున్నారు. మంగళవారం ఫస్ట్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. విశాల్ చంద్రశేఖర్ కంపోజ్ చేసిన ఈ మెలోడీ సాంగ్‌కు శ్రీమణి క్యాచీ లిరిక్స్ రాయగా, గౌర హరి, సింధూరి విశాల్ పాడిన విధానం ఆకట్టుకుంది. ‘మా ఊరి జాతరలో.. కాటుక కళ్లతో.. చాటుగా రమ్మని సైగే చేసే చిన్నది..
ఆ బ్రహ్మే రాసే రాతలన్నీ ఆపి రాశాడే పెళ్లి శుభలేఖ.. ఆకాశం సొంత చుట్టమల్లే మారి నేసిందే మల్లెపూల పడక.. రాములోరు పేర్చిన రాళ్లు ఏరి తీయనా.. ఏటి నీటిపైనే నీకు కోటే కట్టైనా..’ అంటూ సాగిన పాటలో నరేష్, అమృత అయ్యర్ వింటేజ్ లుక్‌లో ఇంప్రెస్ చేస్తున్నారు. నైంటీస్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నరేష్ మాస్ గెటప్‌లో కనిపించనున్నాడు. రావు రమేష్, రోహిణి, అచ్యుత్ కుమార్, బలగం జయరామ్, హరి తేజ, ప్రవీణ్, వైవా హర్ష ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సెప్టెంబర్‌లో సినిమా విడుదల చేస్తామని ప్రకటించారు.