కొత్తగూడెం జీజీహెచ్లో తొలిసారిగా ఆర్థోస్కోపిక్ కీ హోల్ సర్జరీ

కొత్తగూడెం జీజీహెచ్లో తొలిసారిగా ఆర్థోస్కోపిక్ కీ హోల్ సర్జరీ

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కొత్తగూడెంలోని జీజీహెచ్​లో తొలిసారిగా ఆర్థిస్కోపిక్​ కీ హోల్​ సర్జరీలను విజయవంతంగా నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వివరాలను మెడికల్​ కాలేజీ ప్రిన్సిపాల్​ ఎం. శ్రీహరిరావు, హాస్పిటల్​ సూపరింటెండెంట్​ రాధామోహన్​ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. భద్రాచలానికి చెందిన ఎన్​. ఠాగూర్​తో పాటు కొత్తగూడెంకు చెందిన టి. స్రవంతి అనే మహిళకు వేర్వేరు సందర్భాల్లో మోకాలికి దెబ్బ తగిలి ఇబ్బందులు పడ్తున్నారు. 

వీరు ట్రీట్​మెంట్​ కోసం జీజీహెచ్​కు వచ్చారు. ఇద్దరిని పరీక్షించిన వైద్యులు ఏసీఎల్​ లిగ్​మెంట్​ పూర్తిగా దెబ్బతిన్నదని నిర్ధారించారు. ఆర్దో పెడిక్​ హెడ్​ ఆఫ్​ ది డిపార్ట్​మెంట్​ డాక్టర్​ నరసింహారావు ఆధ్వర్యంలో అసిస్టెంట్​ ప్రొఫెసర్​ డాక్టర్​ రాజేశ్, అనస్థీషియన్​ డాక్టర్​ రమేశ్, వైద్య సిబ్బంది అధునాతన ఆర్థో స్కోపిక్​ కీ హోల్​ సర్జరీని  విజయవంతంగా పూర్తి చేశారు.