టైమింగ్స్ బాగున్నాయి : రాత్రి పూట తిరిగే ఫస్ట్ వందే భారత్ రైలు ఇదే

టైమింగ్స్ బాగున్నాయి : రాత్రి పూట తిరిగే ఫస్ట్ వందే భారత్ రైలు ఇదే

ప్రయాణీకుల రద్దీని క్లియర్ చేయడానికి దక్షిణ రైల్వే మొదటిసారిగా 2023 నవంబర్ 21 న తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య సెమీ-హై-స్పీడ్ రైలు వందే భారత్‌ను రాత్రిపూట నడపనుంది.  మరో వందే భారత్ స్పెషల్ నవంబర్ 20న యశ్వంత్‌పూర్/SMVT బెంగళూరు నుండి చెన్నై సెంట్రల్ మధ్య నడుస్తుంది.

చెన్నై సెంట్రల్ స్టేషన్ నుండి ఎనిమిది కోచ్‌ల వందే భారత్ ఎక్స్‌ప్రెస్ మంగళవారం (నవంబర్ 21) రాత్రి 11 గంటలకు బయలుదేరి బుధవారం తెల్లవారుజామున 4.30 గంటలకు SMVT బెంగళూరు చేరుకుంటుంది, రెండింటి మధ్య దూరాన్ని 5.30 గంటల్లో కవర్ చేస్తుంది. నవంబర్ 20న, వందే భారత్ స్పెషల్ SMVT బెంగళూరు నుండి సాయంత్రం 5.15 గంటలకు బయలుదేరి అదే రోజు రాత్రి 10 గంటలకు చెన్నై సెంట్రల్ చేరుకుంటుంది.

ప్రస్తుతం దేశంలో ఉన్న మొత్తం 34 వందే భారత్ రైళ్లు పగటిపూట నడుస్తాయి, అయితే దక్షిణ రైల్వే ప్రయాణికులను రద్దీని తగ్గించడానికి రాత్రిపూట రైళ్లను నడుపుతుంది.  ప్రయాణీకుల ఫీడ్ బ్యాక్ తరువాత మరిన్ని  వందే భారత్ రైళ్లను నడపడంపై ఆలోచన చేస్తామని  దక్షిణ రైల్వే సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.