- ఓటు హక్కు వినియోగించుకున్న 400 మంది
యాదాద్రి, వెలుగు: యాదాద్రి జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొదటి విడత పోలింగ్‌జరిగే ఆరు మండలాల్లో పోస్టల్ బ్యాలెట్ఓటింగ్ ప్రక్రియ ఆదివారం ముగిసింది. 400 మంది ఎంప్లాయిస్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మూడు విడతలుగా జరిగే ఎన్నికల కోసం 8 వేల మంది విధులు నిర్వహిస్తున్నారు. ఎంప్లాయ్ ర్యాండమైజేషన్ ప్రక్రియ కూడా ముగిసింది.
విధులు నిర్వర్తించే వారిలో ఇతర జిల్లాలకు చెందిన ఎంప్లాయ్ ఉన్నందున మూడు విడతల్లో కలిపి దాదాపు 1500 మంది పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌లో పాల్గొనాల్సి ఉంది. మూడు విడతలకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌ను ఈ నెల 7, 10,13న నిర్వహించాల్సి ఉంటుంది.
దీంట్లో భాగంగానే మొదటి విడతలో జిల్లాలోని ఆలేరు, రాజాపేట, తుర్కపల్లి, బొమ్మలరామారం, యాదగిరిగుట్ట, ఆత్మకూర్(ఎం) మండలాల్లోని ఏకగ్రీవమైన 16 పంచాయతీలు పోనూ 137 పంచాయతీల్లో ఈ నెల 11న పోలింగ్ జరుగనుంది. ఈ మండలాల్లోని పంచాయతీల్లో ఆదివారం పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ముగిసింది. ఈ ఓటింగ్ ప్రక్రియను కలెక్టర్ హనుమంతరావు, అడిషనల్ కలెక్టర్ ఏ భాస్కరరావు వేర్వేరుగా పరిశీలించారు.
